ప్రియురాలు x భార్య... ఎవరు ఎలా?

గురువారం, 19 సెప్టెంబరు 2013 (14:16 IST)
FILE
ప్రియురాలికి, భార్యకి మధ్య తేడాలు..

1. ప్రియురాలు తన కోసం ఖర్చుపెట్టమంటుంది. భార్య మనకోసం దాచిపెట్టమంటుంది.
2. ప్రియురాలు కోసం మనం అన్నీ సర్దాలి. భార్య సర్దితే భర్త ఆస్వాదిస్తాడు.
3. బాగుంటే ప్రియురాలు చూస్తుంది. బాగోకపోయినా భార్య చూస్తుంది.
4. ప్రియురాలు ప్రెజెంట్ టెన్స్. భార్య కంటిన్యూయస్ టెన్స్.
5. మనం ఆమెకి నచ్చేవి చేస్తుంటే ఆమె ప్రియురాలని అర్థం. మనకు నచ్చేవి ఆమె చేస్తుంటే ఆమె భార్య అని అర్థం.
6. ప్రియురాలిని మనం తరచుగా నవ్వించాలి... భార్య మనల్ని అపుడపుడు ఏడిపిస్తుంది!
7. భార్య కోసం పనిచేస్తాం. ప్రియురాలి కోసం చేస్తున్న పనీ ఆపేస్తాం! అయితే కొసమెరుపుగా.. రెండు విషయాల్లో మాత్రం ఇద్దరికీ పోలికలు ఉంటాయి. అది జెండర్ అండ్ డేంజర్. చూశారా రెండు పదాలకు కాస్త అటుఇటుగా అక్షరాలు సేమ్!

వెబ్దునియా పై చదవండి