లైంగిక చర్య జరిగితే ప్రేమికులు ఫెవికాల్‌లా అతుక్కుపోతారా...?

శనివారం, 9 మార్చి 2013 (20:19 IST)
WD
ప్రేమలో పడ్డవాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తమలో తామే మాట్లాడుకుంటారు. ఆకలి లేదంటారు. నిద్ర రాదంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలీయదు. అయితే ఇలాంటి ప్రవర్తనకు ప్రేమికులు ఎంతమాత్రామూ బాధ్యులు కాదంటున్నారు పరిశోధకులు. ప్రేమలో పడ్డప్పుడు మెదడులోని కొన్ని భాగాలు వివిధ రకాల రసాయనాలను ఎక్కువుగా ఉత్పత్తి చేస్తాయి. వాటి ఫలితంగానే వీరి ప్రవర్తన ఇలా వింతగా ఉంటుందంటున్నారు.

ఎడ్రిలిన్ ఎక్కువుగా విడుదల కావటం వల్ల ఒళ్ళంతా చెమటలు పడతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నోరు తడారిపోతుంది. అందుకే ప్రేమికులెప్పుడూ ఆందోళనగా కనిపిస్తుంటారు.

డోపమైన్ - ఇది అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రేమపక్షులు ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. తిండి సరిగ్గా తినరూ నిద్రపోరు. అయినా ఏమాత్రం నీరసం లేకుండా సంతోషంగా నవ్వుతూనే ఉంటారు.

సెరెటోనిన్ - ఆలోచనలన్నీ ఒకేదానిపైన నిలిచిపోయేలా చేస్తుంది. అందుకే ప్రేమికుల ఆలోచనలెప్పుడూ తన ప్రియురాలు లేదా ప్రేమికుడి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. పరిసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ ఎదుటివాళ్ల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటారు. లైంగిక చర్య తర్వాత ప్రేమజంట మధ్య అన్యోన్యతను ఇది పెంచుతుంది. ఫెవికాల్ జోడీలా అంటుకుని తిరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

వెబ్దునియా పై చదవండి