హద్దులు లేని "A"ధర చుంబనాలు

PNR

శనివారం, 19 ఏప్రియల్ 2008 (16:33 IST)
FileFILE
ముద్దు... శృంగారంలో పాల్గొనే ఓ స్త్రీ.... పురుషుడు, భావ ప్రాప్తికోసం పెట్టుకునేది. దీన్నే ఆంగ్లంలో 'కిస్' అంటారని అందరికీ తెలిసిన విషయమే. ఇటీవలి కాలంలో ఇంతటి మధురానుభూతిని కలిగించే ఈ 'తీపి ముద్దు' మరీ 'చీప్‌'గా మారింది. రతి క్రీడలో ఓ భాగమైన ఈ అధర చుంబనానికి నేడు ఓ సమయం సందర్భం, చాటూమాటూ అంటూ ఏమీ లేకుండా పోయింది. ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కడ పడితే అక్కడ ఒకరిపై ఒకరు బహిరంగంగానే ముద్దుల వర్షం కురిపించుకోవటం ఇప్పుడ సహజమైపోయింది. ఇటువంటి విచ్చలవిడి ముద్దు శృంగారం విష సంస్కృతిలో భాగమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంస్కృతే హద్దులు దాటితే విపరీత పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అసలెందుకు ఇలా జరుగుతోందీ.... దీనికి కారణమేంటీ... అనే ప్రశ్నలు వేసుకుంటే... సమాధానాలనేకం. అయితే కొందరు అంటున్నట్లుగా... కేవలం నేటి యువతీ యువకులనే తప్పుపట్టలేం. సినీ తారల నుంచి, మంచి పేరున్న సెలిబ్రిటీలు సైతం బహిరంగ అధర చుంబనాలతో నోళ్లు బిగిస్తున్నారు. గతంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరేల ముద్దు వ్యవహారం దేశంలో పెద్ద దుమారం రేపిన విషయం తెల్సిందే. తాజాగా ముంబైలో జరిగిన మరో కార్యక్రమంలో బాలీవుడ్ నటీనటులు, స్వయానా భార్యాభర్తలైన మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్‌ల బహిరంగ ముద్దు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇలాంటి సంఘటనల నుంచి ప్రేరణ పొందిన నేటి యువతీ యువకులకు వారు ఓ చుక్కానిలా మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. ఓ వైపు పెరుగుతున్న జీతభత్యాలు... పెద్దల అదుపు కొరవడటం... అన్నీ కలిసి వారు ఇటువంటి సంస్కృతికి దగ్గరవుతున్నట్లు పలు వార్తల ద్వారా వెల్లడవుతోంది. అవి పార్కులా, బస్టాపులా, బీచ్‌లా, పర్యాటక ప్రాంతాలా, కళాశాలలా అనేది చూడకుండా కుర్రకారు తమ హద్దులు దాటి ముద్దుల వర్షం కురిపించుకుంటున్నారు. ఇవి ప్రేమికులకు, యువతీయువకులకు మంచి ఆనందాన్ని కలిగించవచ్చేమో గానీ.. ఆహ్లాదం కోసం కుటుంబ సభ్యులతో విహారానికి వెళ్లిన కుటుంబ పెద్దలకు మాత్రం పెద్ద సమస్యగా మారింది.

వెబ్దునియా పై చదవండి