శృంగారం అందరికీ ప్రేరణ అందించే రంసమని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. అయితే, జంతుజాలం కలవడానికి, స్త్రీపురుషులు కలవడానికి విభిన్నత ఉంది. జంతువులు సంతానం కోసం కలుస్తుంటే, స్త్రీపురుషులు మాత్రం సంతానోత్పత్తితో పాటు.. తమ రెండు శరీరాలను ఒకటి చేసుకోవడం ద్వారా ఎల్లలులేని రతి సుఖాన్ని అనుభవించేందుకు సంగమిస్తుంటారు.
నిజానికి ఈ భూమిపై ఉన్న అన్ని జీవరాశులూ లైంగిక ప్రక్రియలో పాల్గొంటాయి. ప్రకృతి ధర్మం మేరకు స్త్రీపురుషులు పునరుత్పత్తి, శారీరక సుఖం కోసం కలుస్తుంటారు. అయితే, జంతుజాలాలకు నిర్ధిష్ట కాలంలోనే సంయోగం చేసుకుంటాయి.
కానీ, స్త్రీపురుషులకు మాత్రం కాలంతో పనిలేదు. ఎపుడైనా.. ఎక్కడైనా.. రెండు మనస్సులు ఇష్టపడితే లైంగికంగా కలుసుకుంటుంటారు. అందుకే శృంగారం ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగించే రసంగా సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతుంటారు.