2008లో ఫలించని 'డబ్బింగ్' మంత్రం

PNR

FileFILE
తెలుగు చిత్ర పరిశ్రమలో 2008 సంవత్సరం ద్విభాషా/అనువాద చిత్రాలకు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. కేవలం అనువాద చిత్రాలకే కాకుండా ద్విభాషా చిత్రాలు సైతం పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈ యేడాది ప్రారంభోత్సవంలో భారీ అంచనాలతో వచ్చిన 'దశావతారం' చిత్రం అటు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను తీవ్ర నిరాశకు లోను చేసింది. పద్మశ్రీ కమల్‌హాసన్ పది వేషాల్లో కనిపించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డు సాధించినప్పటికీ.. విజయంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ముఖ్యంగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను తీవ్ర నిరాశకు లోను చేసింది. అలాగే.. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, జగపతి బాబుల కాంబినేషన్‌లో వచ్చిన 'కథానాయకుడు' చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో ఏకకాలంలో విడుదలైన, రెండు చోట్లా పరాజయం పాలైంది. అయితే నటనాపరంగా జగపతిబాబు (కథానాయకుడు), పశుపతి (తమిళం)లు మంచి మార్కులు కొట్టేశారు.

ఇకపోతే భారీ అంచనాలతో గౌతంమీనన్ దర్శకత్వంలో వచ్చిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ చిత్రానికి హీరో సూర్య అన్నీతానై చూసుకున్నాడు. అయినా ఫలితం దక్కలేదు. అయితే.. కథా పరంగా చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. పాటలు మాత్రం హిట్ సాధించి, ప్రేక్షకులను ఆలరించాయి.

తమిళంలో మరో హీరో అయిన విశాల్ నటించిన 'సెల్యూట్' చిత్రం అటు తమిళం, ఇటు తెలుగులోనూ నిరాశపరిచింది. ఈ చిత్రంలో నయనతార 'టూపీస్' దుస్తులు, విశాల్ 'సిక్స్ ప్యాక్' బాడీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేక పోయాయి. అలాగే.. 'సరోజ', 'గది నెబర్ 305', తదితర అనువాద చిత్రాలు కూడా పరాజయం బాటలోనే పయనించాయి. దీంతో ఈ యేడాది అటు అనువాద, ఇటు డబ్బింగ్ చిత్రాలు పెద్దగా ఆదరణ లభించలేదని చెప్పుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి