సంక్రాంతి స్పెషల్ : నేతి అప్పాలు

బుధవారం, 10 జనవరి 2018 (13:17 IST)
సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. సంక్రాంతికి చక్కెర పొంగలి, పాయసం, గారెలు వంటి పదార్థాలు తయారుచేస్తుంటాం. అలాగే ఈ పండుగకు నేతితో అప్పాలు ఎలా చేయాలో ట్రై చేసి చూద్దాం.  
 
కావలసిన పదార్థాలు  
పచ్చిబియ్యం - రెండు కప్పులు 
బెల్లం పొడి - రెండు కప్పులు 
ఏలకుల పొడి - ఒక టేబుల్ స్పూన్ 
అరటి పండ్ల గుజ్జు - ఒక కప్పు 
గోధుమ పిండి- రెండు టీ స్పూన్లు 
నెయ్యి - అర కప్పు 
 
తయారీ విధానం : 
పచ్చిబియ్యాన్ని గంట పాటు నాన బెట్టి శుభ్రం చేసి జారుగా రుబ్బాలి. ఈ పిండిలో బెల్లం, ఏలకుల పొడి, అరటిపండు గుజ్జు, గోధుమ పిండిని చేర్చి రుబ్బుకోవాలి. ఈ పిండిని రెండు లేదా మూడు గంటల పాటు పక్కనబెట్టాలి. అప్పాలు చేసే బాణలి వేడయ్యాక నెయ్యి పోసి.. సన్నని సెగపై అప్పాలను కాల్చుకోవాలి. అంతే నేతి అప్పాలు రెడీ.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు