అసలే రోజులు బాగోలేదు... ?

మంగళవారం, 7 అక్టోబరు 2008 (17:31 IST)
వార్త : పాత మిత్రుల కోసం మా పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి... పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్

చెవాకు : హలో డీఎస్ గారూ... వస్తారో రారో తెలియని మిత్రుల కోసం మీరేమో పార్టీ తలుపులు తెరిచి పెట్టామని చెప్పారు. మీ మాటలు విని పాత మిత్రులు వస్తారో రారో తెలియదు గానీ... తలుపులు తెరిచి పెట్టిన సమయంలో లోపలున్నవారెవరైనా బయటికి వెళ్తారేమో కాస్త జాగ్రత్తపడండి. ఎందుకంటే అసలే రోజులు బాగోలేదు మరీ...

వెబ్దునియా పై చదవండి