దీని భావమేంటి సుఖేందరా

వార్తః టీడీపీలో అధినేత చంద్రబాబుకు భయపడి చాలా మంది నేతలు జరిగే పరిణామాలను పార్టీ వేదికలపై మాట్లాడేందుకు సంకోచిస్తున్నారని, ఈ పద్దతితోనే పార్టీ మునిగిపోగలదని గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ఫోన్ ఇన్ చర్చా కార్యక్రమంలో హెచ్చరించారు.

చెవాకుః పార్టీ మునకకు అధినేతే కారణమని చెప్పకనే చెబుతున్నారన్నమాట. కోటగిరి విద్యాధరరావులా సిద్ధమైపోయినట్టు తెలుస్తోంది. పార్టీ అనుకూలించినన్ని రోజులు అన్నీ అనుభవించడం, తేడా వస్తే దూషించడం నేతలకు సాధరణమేగా. ఆలేరులో మీ పార్టీ ఘోర పరాజయానికి మీరు కారణం కాదంటున్నారు? బాగానే ఉంది కానీ మీరు కృషి చేసి ఉంటే గెలుపు మాట అటుంచితే నర్సింహులు కనీసం గట్టి పోటీ అయినా ఇచ్చే వాడు కాదా? అభ్యర్థి నచ్చకుంటే మీలాంటి సొంత పార్టీ నేతలే వారిని నట్టేట ముంచుతారనడానికి ఇంతకన్నా మరో ఉదాహరణమేముంటుంది?

వెబ్దునియా పై చదవండి