భారీ లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్

గురువారం, 18 సెప్టెంబరు 2014 (19:18 IST)
బాంబే స్టాక్ మార్కెట్లు గురువారం ఆశాజనకంగా ముగిశాయి. భారీ లాభాలను ఆర్జించిన సెన్సెక్స్ ఏకంగా 480 పాయింట్లు లాభపడి 27,112 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 139 పాయింట్లు లాభపడి 8,115 వద్ద ముగిశాయి. 
 
ప్రధానంగా చైనా కేంద్ర బ్యాంకు నుంచి భారీ సహాయక ప్యాకేజీ, ఫెడరల్ రిజర్వ్ సమీక్ష ఫలితాలు అనుకూలంగా ఉండడంతోనే మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.జూన్ 2న సెన్సెక్స్ 467 పాయింట్లు పెరగగా, మళ్లీ మూడు నెలల తర్వాత ఇంత భారీగా లాభపడటం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.  
 
ఇకపోతే.. హీరోమోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్, ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్ తదితర షేర్లు లాభాలను ఆర్జించాయి. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి