బాంబే స్టాక్ మార్కెట్.. సరికొత్త రికార్డ్ 75వేల మార్కును తాకింది..

సెల్వి

మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (18:31 IST)
బుధవారం నాటి కీలక యూఎస్ ద్రవ్యోల్బణం డేటా అంచనాలతో భారతీయ మార్కెట్లు అధిక స్థాయిలలో లాభాలను గడించాయి. అంతేగాకుండా బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం సరికొత్త చరిత్రను సృష్టించింది. చరిత్రలో తొలిసారి బీఎస్ఈ 75 వేల మార్క్‌ను తాకింది. 
 
మార్చి 6న 74 వేల మార్క్ ను తాకిన బీఎస్ఈ... కేవలం 24 సెషన్లలోనే 75 వేల మార్క్‌ను తాకింది. 24 సెషన్లలోనే వెయ్యి పాయింట్లు పెరిగింది. 
 
ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 50 24.55 పాయింట్లు పడిపోయి 22,641.75 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 77 పాయింట్లు నష్టపోయి 74,665.32 వద్ద ముగిసింది. అయినా ట్రెండ్‌ను సృష్టిస్తూ.. 77వేల మార్కును బీఎస్ఈ తాకింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు