ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్: బింద్రాకు రజత పతకం!

ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో జు క్వినాన్‌ను ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న బింద్రా అతని చేతుల్లోనే ఓడి, రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. క్వినాన్ 700.2 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, బింద్రాకు 697.6 పాయింట్లు లభించాయి.

అలాగే భారత్‌కే చెందిన సత్యేంద్ర సింగ్ 696.7 పాయింట్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకోగా, గగన్ నారంగ్‌కు ఏడో స్థానం దక్కింది. మహిళల విభాగంలో భారత షూటర్లు అంజలి భగవత్‌కు తొమ్మిది, ప్రియా అగర్వాల్‌కు 12, సుమా షిరూర్‌కు 20వ స్థానం లభించాయి.

వెబ్దునియా పై చదవండి