ఎఫ్1 జట్టును అమ్మేసిన బీఎండబ్ల్యూ

File
FILE
ప్రముఖ ఫార్ములా వన్ జట్టు సంస్థ బీఎండబ్ల్యూ.. తన ఎఫ్1 జట్టును అమ్మేసింది. మధ్యప్రాచ్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన స్విట్జర్లాండ్ సంస్థ కాడ్‌బాడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే సంస్థకు బీఎండబ్ల్యూ ఎఫ్1 జట్టును విక్రయించింది. ఈ సీజన్ ముగిసిన తర్వాత ఎఫ్1 నుంచి తాము వైదొలగేందుకు నిర్ణయించినట్లు గతంలోనే బీఎండబ్ల్యూ ప్రకటించింది.

ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ.. ఈ సీజన్ ముగింపులో లోపల తన ఎఫ్1 జట్టును విక్రయించింది. వచ్చే సీజన్‌ నుంచి కాడ్‌బాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ ఎఫ్1 జట్టుతో బరిలోకి దిగనుంది. ఈ అమ్మకానికి సంబంధించి ఒప్పందంపై సంతకాలు కూడా చేసినట్లు బీఎండబ్ల్యూ తన ప్రకటనలో తెలిపింది.

ఈ ఒప్పందంలో భాగంగా.. బీఎండబ్ల్యూకు.. కాడ్‌బాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ. 567 కోట్లు చెల్లించింది. ఇంగ్లండ్‌కు చెందిన పాత ఫుట్‌బాల్ లీగ్ సాకర్ క్లబ్ ఈ కాడ్‌బాక్ సంస్థ. కాగా, బీఎండబ్ల్యూ జట్టు యథావిధిగా స్విట్జర్లాండులోని హెవిల్‌‌లోనే కొనసాగుతుంది. గతంలోలాగే.. ఫెరీరా ఇందుకు ఇంజిన్‌లను సమకూరుస్తుంది.

వెబ్దునియా పై చదవండి