ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి భారత దేశంలో అతడో పెద్ద స్టార్ అయ్యాడు. యువతకు ఆదర్శప్రాయంగా మారాడు. ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు అథ్లెటిక్స్‌లో ఒక్క పతకం కూడా సాధించని భారత్.. నీరజ్ చోప్రా పుణ్యమాని చరిత్రను తిరగరాసింది.
ఇటీవల ఒక ఆంగ్ల మీడియా నీరజ్ చోప్రాను ఆన్‌లైన్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఆయన వ్యక్తిగత, క్రీడా జీవితానికి సంబంధించిన పలు ప్రశ్నలు కొందరు అడిగారు. ఈ క్రమంలో చరిత్రకారుడు రాజీవ్ సేథీ లైన్‌లోకి వచ్చారు. 'అందమైన కుర్రాడివి. నీ సెక్స్‌జీవితాన్ని, అథ్లెటిక్స్ ట్రైనింగ్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకొంటున్నావు?' అని ప్రశ్నించారు.
ఈసారి కూడా నీరజ్ సహనం కోల్పోకుండా 'ప్లీజ్ సర్, మీ ప్రశ్నతో నా మనసు నిండిపోయింది' జవాబిచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. నీరజ్ చోప్రాకు ప్రశ్న వేసిన రాజీవ్ సేథి వైఖరిని చాలా మంది ప్రముఖులు ఖండించారు.