రియో ఒలింపిక్స్‌లో సింధూ ప్రతిభ అమోఘం : చాముండేశ్వరినాథ్‌

శనివారం, 20 ఆగస్టు 2016 (12:37 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో పి.వి.సింధు కనబరిచిన ప్రతిభ అమోఘమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్‌ కొనియాడారు. సింధుకి చిన్న వయసే కనుక జీవితంలో మరిన్ని విజయాలు సాధిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
తిరుమల శ్రీవారిని ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో దర్శించుకున్న చాముండేశ్వరినాథ్‌ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అలాగే ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
రియో ఒలింపిక్స్ క్రీడల్లో మంగళవారం రాత్రి జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్లో సింధు  21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ మారిన్ చేతిలో ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడిన విషయం తెల్సిందే. దీంతో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలి గేమ్ను గెలిచిన సింధు.. ఆపై వరుస రెండు గేమ్లలో ఒత్తిడికి‌లోనై ఓటమి చెందింది.

వెబ్దునియా పై చదవండి