Karthik Raju: సరికొత్తగా విలయ తాండవం వుంటుందన్న కార్తీక్ రాజు

చిత్రాసేన్

శుక్రవారం, 3 అక్టోబరు 2025 (12:27 IST)
Vilaya Tandavam poster and movie team
కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 గా మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు నిర్మిస్తున్న చిత్రం విలయ తాండవం.  ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
అనంతరం హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ .. ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలనే జనాలు ఆదరిస్తున్నారు. మంచి కాన్సెప్ట్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. డైరెక్టర్ వాసు సరికొత్త పాయింట్, కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ వచ్చాక అందరూ ఆశ్చర్యపోతారు. ఈ మూవీలో నేను, పార్వతి, జగదీష్ చాలా ముఖ్యమైన పాత్రల్ని పోషించాం. నిర్మాతలైన ధర్మా రావు, గుంపు భాస్కర రావు నాకు ఫ్యామిలీ మెంబర్లలా మారిపోయారు. ఈ మూవీతో మా అందరికీ పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
నిర్మాత మందల ధర్మా రావు మాట్లాడుతూ .. డైరెక్టర్ వాసు మాకు ఈ కథను చెప్పినప్పుడే ఆశ్చర్యపోయాను. అద్భుతమైన కథతో మూవీని నిర్మించాం. ఈ పోస్టర్ చూస్తేనే కథ ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో ఆడియెన్స్ ముందుకు వస్తామని అన్నారు.
 
నిర్మాత గుంపు భాస్కర రావు మాట్లాడుతూ .. డైరెక్టర్ వాసు చెప్పిన కథ మాకు చాలా నచ్చింది. కథలో దమ్ముంది అని నాకు అర్థమైంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మేం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని నిర్మించాం. మాకు మీడియా, ఆడియెన్స్ నుంచి ఆశీస్సులు లభిస్తాయని కాంక్షిస్తున్నాను అని అన్నారు.
 
దర్శకుడు వీఎస్ వాసు మాట్లాడుతూ .. మా స్నేహితుడు సంజయ్ వల్లే ఈ మూవీ ప్రయాణం మొదలైంది. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన కార్తీక్ రాజుకి థాంక్స్. త్వరలోనే మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రానుంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
 
ఇంకా ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు, మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ, కొరియోగ్రాఫర్ ఆట సందీప్, కపిల్ మాస్టర్ మాట్లాడుతూ, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు