ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ ప్రత్యేక గీతంతో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.
నటీనటులు : పవన్ కళ్యాణ్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కోషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ తదితరులు