అరేబియా గడ్డ ఖతార్‌లో ఫిఫా ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, మొరాకో జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. బెల్జియం జట్టును 2-0 తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో ఆ దేశ రాజధాని బ్రసెల్స్‌లో అల్లర్లు చెలరేగాయి.
ఫలితంగా బ్రసెల్స్‌లో అల్లర్లు చెలరేగాయి. కొందరు ఆందోళనకారులు అద్దాలను పగులగొట్టారు. మరికొందరు వాహనాలకు నిప్పు అంటించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు వాటర్ కేన్లతో పాటు టియర్ గ్యాస్‌లను ప్రయోగించారు. అల్లర్లకు సంబంధించి 11 మందిని అరెస్టు చేశారు. ఒకరిని కస్టడీలోకి తీసుకున్నారు.
అలాగే, బెల్జియం తూర్పు నగరమైన లీగ్‌లో 50 మంది ముఠా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసింది. అద్దాలను పగులగొట్టి, రెండు పోలీస్ వాహనాలను ధ్వంసం చేసింది. దీంతో పోలీసులు వాటర్ కేన్లను ఉపయోగించి వారిని చెదరగొట్టారు.