ప్రస్తుతం జరుగుతోన్న బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా సోమవారం మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో సింధు 21-15, 21-13తో మిచెల్ లీ (కెనడా)పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ గతంలో 10 సార్లు తలపడగా 8 విజయాలతో సింధూదే పైచేయి కావడం గమనార్హం