ఇటీవల, 22 ఏళ్ల మసా అమిని అనే మహిళ హిజాబ్ ధరించలేదని అరెస్టు అయ్యింది. అంతేగాకుండా ఆమెపై పోలీసులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. దీంతో కోమాలోకి వెళ్లిన ఆమె జనవరి 17న ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనకు దిగారు.
పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. 14,000 మందిని అరెస్టు చేశారు.
ఈ పరిస్థితిలో, సారా ఖడెమ్ దేశానికి తిరిగి వస్తే అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పబడింది. ప్రస్తుతం, ఆమె స్పెయిన్‌లో నివసిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఇకపై దేశానికి తిరిగి వెళ్లేది లేదని టాక్ వస్తోంది.