విదేశీ కోచ్‌తో ఆట మెరుగైంది: పీవీ సింధు

సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:14 IST)
విదేశీ కోచ్‌‌ కిమ్‌‌ జి హ్యూన్‌‌ వల్ల తన ఆటతీరు ఎంతో మెరుగైందని వరల్డ్‌‌ చాంపియన్‌‌ ప్లేయర్‌‌ పీవీ సింధు చెప్పింది. ముఖ్యంగా కిమ్‌‌ ఇచ్చిన సలహాలు, సూచనలపై వర్క్‌‌ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయని ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పేర్కొంది. 
 
‘కిమ్‌‌ ఇచ్చిన సలహాలు ఎంతగానో హెల్ప్‌‌ అయ్యాయి. గత కొన్నేళ్లుగా ఇక్కడే సేవలందిస్తున్న ఆమె ప్రభావం చాలా ఉంది. దీనికి చీఫ్‌‌ కోచ్‌‌ పుల్లెల గోపీచంద్‌‌ గైడెన్స్‌‌ కూడా తోడయ్యింది. నా ఆటను ఇప్పటికే చాలా మెరుగుపర్చుకున్నా. మరింతగా ఇంప్రూవ్‌‌ చేసుకోవాల్సి ఉంది. నొజోమి ఒకుహార (జపాన్‌‌)తో వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్‌‌ పోరును ఫ్రెష్‌‌గా ఆరంభించా. 2017 ఫలితం గురించి ఆలోచించలేదు. 
 
నిజానికి ఆ మ్యాచ్‌‌ అనంతరం రెండుసార్లు ఆమెతో తలపడ్డా అని సింధు చెప్పుకొచ్చింది. వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో తాను చాలా అలెర్ట్‌‌గా ఉన్నానని, ఈ టోర్నీ కోసం బాగా సన్నద్ధమయ్యాయని తెలిపింది. చెన్‌‌ యూఫీ (చైనా), ఒకుహరలాంటి డిఫరెంట్‌‌ స్టైల్‌‌ ఉన్న ప్లేయర్లను ఎదుర్కోడానికి మరింత దూకుడుగా, వేగంగా ఆడానని చెప్పుకొచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు