లైంగిక సమ్మతికి 18 యేళ్లు నిండాల్సిందే : కేంద్రం స్పష్టీకరణ

ఠాగూర్

శుక్రవారం, 8 ఆగస్టు 2025 (09:33 IST)
లైంగిక సమ్మతికి 18 యేళ్లు నిండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. 18 సంవత్సరాలు దాటిన వారే లైంగిక చర్యకు సమ్మతం తెలుపడానికి అర్హులని కేంద్రం వెల్లడించింది. ఈ వయోపరిమితిని 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వాదనకు స్పందనగా ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది. 
 
సమాజంలో జరుగుతున్న మైనారిటీ తీరనివారిని లైంగిక మోసాలు, దోపిడీల నుంచి కాపాడేందుకు ఈ విధానాన్ని ఉద్దేశపూర్వకంగా, బాగా ఆలోచించి అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. యువతీ యువకుల మధ్య శృంగార భరిత ప్రేమ పేరుతో ఈ వయోపరిమితిని సవరించడం చట్టవ్యతిరేకమే కాక ప్రమాదకరం కూడా అని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. 
 
యువతీ యువకుల మౌనాన్ని, భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని లైంగిక దురాగతాలకు పాల్పడే వారిని ఈ పరిమితి కట్టడి చేస్తుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వయోపరిమితిని తగ్గిస్తే అదే సాకుగా పిల్లల అక్రమ రవాణా, బాలలపై జరిగే నేరాలు అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతాయని అభిప్రాయపడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు