ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్ కార్ల ఈవెంట్ 'ఫార్ములా -ఈ' రేసు భాగ్యనగర నడిబొడ్డున జరుగనుంది. 'ఫార్ములా ఈ-రేస్' చాంపియన్‌షిప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్ క్రీడల సమాఖ్య బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు.