హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమలు

గురువారం, 30 జూన్ 2022 (07:59 IST)
హైదరాబాద్ నగరంలో 144వ సెక్షన్ అమలు కానుంది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి జూలై నాలుగో తేదీ సాయంత్రం వరకు ఈ సెక్షన్‌ను మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అమలు చేస్తారు.
 
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 2, 3వ తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ భాగ్యనగరానికి వస్తున్నారు. దీంతో పోలీసులు ఆంక్షలు విధించారు. 
 
ముఖ్యంగా ప్రధాని నగరంలో ఉన్నరోజులు పటిష్టమైన భద్రతను కల్పిస్తారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే, నో ఫ్లయింగ్ జోన్స్‌ను ప్రకటిస్తారు. 
 
హైదరాబాద్ పరిధిలోని పరేడ్ గ్రౌండ్, రాజ్‌భవన్ పరిసరాలతో పాటు సైబరాబాద్ పరిధిలోని నోవాటెల్ వరకు నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. డ్రోన్స్, రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్, మైక్రోలైట్స్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌పై నిషేధం విధిస్తారు. ఈ అంక్షలను ఉల్లంఘిస్తే క్రమినల్ కసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు