హాకీ దిగ్గజం మొహ్మద్ షాహిద్ ఇక లేరు.. కిడ్నీ వ్యాధితో కన్నుమూత

బుధవారం, 20 జులై 2016 (13:14 IST)
భారత హాకీ దిగ్గజం మొహ్మద్ షాహిద్ కన్నుమూశారు. ఆయన వయసు 56 యేళ్లు. భారతదేశం గర్వించదగిన దిగ్గజ క్రీడాకారుల్లో ఆయన ఒకరు. జాతీయ క్రీడ హాకీలో మేటి క్రీడాకారుడిగా పేరుగాంచిన షాహిద్... 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 
 
గత కొంతకాలంగా కాలేయ, మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతూ వచ్చిన ఆయనకు వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో హాకీ క్రీడాకారుడు ధన్ రాజ్ పిళ్లై చేసిన విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.5 లక్షలు విడుదల చేశాయి. 

వెబ్దునియా పై చదవండి