సౌదీ అరేబియా టూర్‌కు వెళ్లిన మెస్సీ.. సస్పెండ్ చేసిన టీమ్
శుక్రవారం, 5 మే 2023 (21:04 IST)
ప్రముఖ సాకర్ ఆటగాడు మెస్సీ తన కుటుంబంతో సౌదీ అరేబియాకు పర్యటనకు వెళ్లిన కారణంగా అతను సస్పెన్షకు గురయ్యాడు. లియోనల్ మెస్సీ ప్రస్తుతం పారిస్ సెయింట్ జర్మైన్ తరపున ఆడుతున్నాడు.
ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్‌కు సమాచారం ఇవ్వకుండా కుటుంబ సమేతంగా సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లాడు. దీంతో మెస్సీని రెండు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్యారిస్ సెయింట్ జర్మైన్ టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది.
జట్టు తనను సస్పెండ్ చేయడంపై లియోనల్ మెస్సీ గుర్రుగా వున్నాడని.. అతను ఆ జట్టుకు దూరమై సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్ చేత 400 మిలియన్ డాలర్లకు సంతకం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.