హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ సింధు 15-21, 17-21 తేడాతో మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో తప్పిదాలతో సింధు పలు పాయింట్లను చేజార్చుకుంది. రెండో గేమ్ చివర్లో సింధు పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అంతకుముందు.. పీవీ సింధు సెమీస్‌లో చెంగ్ నగన్‌యి పై సంచలన విజయం సాధించింది. 21-14, 21-16 స్కోరు తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. కొద్ది రోజుల క్రితం చైనా ఓపెన్‌లో సంచలనం సృష్టించి తొలిసార్ ఛాంపియన్‌గా నిలిచిన సింధు ఇప్పుడు హాంకాంగ్‌లో మరో టైటిల్ దక్కించుకోలేకపోయింది.
పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు సమీర్ వర్మ మరో సంచలన సృష్టించాడు. సెమీస్‌లో 3వ సీడ్ డెన్మార్గ్ ఆటగాడు జార్జెన్సన్‌ను చిత్తు చేశాడు. 21-19, 24-22 పాయింట్ల తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు.