షరపోవాకు అవమానం.. గాయాలతో తిరిగొస్తే ఓకే.. డోపింగ్ నిషేధం కారణంగా?

బుధవారం, 17 మే 2017 (16:05 IST)
ఫ్రెంచ్ ఓపెన్‌‍లో రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు వైల్డ్ కార్డు ఇవ్వడం లేదని టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో షరపోవాకు నిరాశే మిగిలింది. ఇప్పటికే మాడ్రిడ్ ఓపెన్‌లో షరపోవాకు నిరాశే మిగిలింది. మరియా షరపోవా గాయంతో ఆటకు దూరమై తిరిగొస్తే వైల్డ్‌కార్డ్ పొందొచ్చు కానీ డోపింగ్ నిషేధం కారణంగా తిరిగొస్తే వైల్డ్ కార్డ్ ఇవ్వలేమని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్ గుడిచెల్లి తెలిపారు. దీంతో గతంలో రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన షరపోవా.. ఈసారి ఈ టోర్నీలో ఆడే అవకాశాన్ని కోల్పోయింది. 
 
కాగా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన కేసులో షరపోవా 15 నెలల నిషేదం గడువు ముగిశాక 'వైల్డ్‌ కార్డు'ల సహాయంతో షరపోవా మూడు టోర్నీల్లో ఆడింది. అయితే ఫ్రెంచ్‌ ఓపెన్‌ అర్హత టోర్నీ ఆడడటానికి సరిపడినన్ని ర్యాంకింగ్‌ పాయింట్లు షరపోవాకు లేకపోవడంతో ఆమెకు వైల్డ్ కార్డ్ మిస్స్సైంది. కానీ షరపోవా టాప్‌ 200లోకి రావడంతో జూలైలో జరిగే వింబుల్డన్‌ టోర్నీ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ఆడేం దుకు అర్హత సాధించింది.

వెబ్దునియా పై చదవండి