రియో ఒలింపిక్స్‌లో భారత జెండాకు గౌరవాన్ని సంపాదించిపెట్టిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ అవార్డును అందుకున్న అతి చిన్న వయస్కురాలిగా సింధూ రికార్డును సృష్టించింది. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించడం ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు కొట్టేసిన పీవీ సింధు.. సెలెబ్రిటీల సరసన చేరిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో పద్మభూషణ్ అవార్డుకు ఆమె పేరు కూడా చేరింది.
ఇకపోతే.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీకి కూడా పద్మ భూషణ్ అవార్డు లభించింది. వీరితో పాటు విశ్వమోహన్ భట్, సాక్షీ మాలిక్, పుల్లెల గోపీచంద్, బాలీవుడ్ ఆశా పారేఖ్, నేపథ్య గాయకులు కైలాష్ ఖేర్, నటుడు మనోజ్ బాజ్ పేయి, నృత్య కళాకారిణి లక్ష్మీ విశ్వనాథన్, రంగస్థల నటుడు బసంతి బిస్త్, కథకళి నృత్యకారుడు సీకే నాయర్, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్, బాలీవుడ్ వెటరన్ నటుడు రిషి కపూర్‌లకూ పద్మభూషణ్ అవార్డులు లభించాయి. ఇక పద్మశ్రీ అవార్డులకు క్రీడారంగంలో విరాట్ కోహ్లీ, దీపా మాలిక్, దీపా కర్మాకర్, వికాస్ గౌడ, పీఆర్ శ్రీజేష్‌లకు లభించాయి.