నర్సింగ్ యాదవ్‌పై ఏంటి వివాదం.. వివరాలివ్వండి : రెజ్లింగ్‌ సమాఖ్యకు మోడీ ఆదేశం

మంగళవారం, 26 జులై 2016 (11:46 IST)
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ వివాదం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి చేరింది. దీంతో నర్సింగ్ యాదవ్ వివరాలు ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం కోరింది. రియో ఒలింపిక్స్ క్రీడా పోటీలకు ఎంపిక అయిన నర్సింగ్ యాదవ్ డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అది పెను వివాదమైన విషయం తెల్సిందే. దీనిపై మీడియా వరుస కథనాలు ప్రసారం చేయడంతో దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 
 
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను వివరణ అడిగారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలను అందజేయాలని ఆయనను ఆదేశించారు. 74 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్‌కు నర్సింగ్ యాదవ్ ఎంపిక అయిన నాటి నుంచి అతని చుట్టూ వివాదం రాజుకుంటూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నర్సింగ్ డ్రగ్ టెస్టులో విఫలం కావడం పెను కలకలం రేపింది. 

వెబ్దునియా పై చదవండి