యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ అర్థాంతరంగా నిష్క్రమించాడు. దీంతో ఆయన 29 వరుస విజయాలు, 18వ గ్రాండ్ స్లామ్ ఆశలకు బ్రేక్ పడినట్లయింది. ఇందుకు కారణం ఏంటంటే.. నోవాక్ జకోవిచ్ కోపంతో విసిరిన బంతే. కోర్టులో ఆటగాడు కావాలని ప్రమాదకరంగా బంతిని విసరడం ఆట నిబంధనలకు విరుద్ధం. నియమ నిబంధనలకు విరుద్ధంగా నోవాక్ జకోవిచ్ ఈ విధంగా ప్రవర్తించడంపై యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ తీవ్రంగా మండిపడుతోంది.