అలాగే పంచకులలో అథ్లెట్ల కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నిర్మిస్తామనీ, అక్కడ అతను కోరుకుంటే అధిపతిగా ఉంటారని తెలిపారు. ఇతర ఆటగాళ్ల మాదిరిగానే అతనికి 50% రాయితీతో ప్లాట్లు ఇవ్వబడతాయన్నారు హర్యానా సీఎం ఎంఎల్ ఖట్టర్.
కాగా టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా సరికొత్త చరిత్రను లిఖించాడు. అథ్లెటిక్స్‌లో దేశానికి బంగారు పతకం అందించాడు. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సూపర్ షో కనబరిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జావెలిన్‌ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి అందరికంటే అగ్రపథాన నిలిచాడు. ఫలితంగా అథ్లెటిక్స్‌లో నీరజ్ బంగారు పతకాన్ని అందించి ఇండియాకు చిరస్మరణీయ రోజును మిగిల్చాడు.
ఇకపోతే, శనివారం జరిగిన ప్రతి అటెంప్ట్‌లోనూ నీరజ్ నిప్పులు చెరిగే రీతిలో జావెలిన్ త్రో చేశాడు. ప్రతి త్రోలోనూ అతను మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ఆరంభం నుంచి లీడింగ్‌లో ఉన్న చోప్రా.. ఇండియాకు అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించాడు. వద్‌లేచ్ జాకుబ్ 86.67 మీటర్లు, వెస్లీ వెటిస్లేవ్ ల85.44 మీటర్ల దూరం విసిరి సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అందుకున్నారు.