టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో బుధవారం భారత్ ఆటగాడు ఫైనల్‌కు అడుగుపెట్టాడు. బుధవారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్‌కు చేరాడు. తొలి ప్రయత్నంలోనే అతను రికార్డు స్థాయిలో 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసిరాడు.
గ్రూప్-ఏ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్స్‌కు చేరాలంటే 83.50 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసరాల్సి ఉంటుంది.. లేదంటే తొలి 12 మందిలో నిలవాల్సి ఉంటుంది. నీరజ్ చోప్రా ఏకంగా 86 మీటర్లకు జావెలిన్‌ను సంధించడంతో ఆటోమేటిక్‌గా ఫైనల్స్‌కు అర్హత సాధించినట్లయింది.