పాకిస్థాన్ జూనియర్ జట్టు లఖ్‌నవూ రావడానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత్‌లో నిర్వహిస్తున్న జూనియర్ హాకీ ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు ప్రభుత్వం నిరభ్యంతర పత్రం ఇచ్చినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపిందని పాకిస్థాన్ హాకీ సమాఖ్య వెల్లడించింది. ఇంకా తమ జట్టు ఈ టోర్నీలో మెరుగ్గా ఆడుతుందని పాకిస్థాన్ హాకీ తెలిపింది.