మల్లేశం, 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ “23” తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. సినిమా మే 16న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ ఆర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
23 లాంటి కథతోనే ఎందుకు రావాలనిపించింది?
-ఇది కోఇన్సిడెంట్లుగా జరిగింది. ప్లాన్ చేసుకున్నది కాదు. 8 A.M. Metro తర్వాత బ్రేక్ తీసుకుందామని అనుకున్నాను. ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ ని కలిసినప్పుడు ఆయన చిలకలూరిపేట ఇన్సిడెంట్ గురించి చెప్పారు. ఆ సంఘటన గురించి నాకు తెలుసు. అప్పుడు నాకు 19 ఏళ్ళు. అయితే ఆ సంఘటన ఆ ఘటన గురించి ఇప్పుడు విన్న తర్వాత అందులో చాలా కథలు కనిపించాయి . అయితే చేసిన తప్పుని అప్పుడు సమర్ధించడం లేదు సినిమాలో కూడా సమర్థించలేదు. కానీ అది సినిమా ఫార్మెట్ కి పనికొచ్చే కథ కాదనిపించింది. అదే రాత్రి ఫ్రెండ్ కాల్ చేసి చుండూరు ఘటన గురించి చెప్పాడు. ఆ ఇన్సిడెంట్ లో కూడా సినిమాకి పనికొచ్చే కథ లేదు. అయితే ఈ రెండు కథలని కాంట్రాస్ట్ చేసి చూస్తే సినిమాకి పనికొచ్చే కథ కనిపించింది. ఈ రెండు కథలతో పాటు జూబ్లీ హిల్స్ స్టోరీ కూడా ఉంటుంది. అలాగే అమ్మాయి అబ్బాయి ప్రేమ కథ చాలా కీలకం. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే. ఆ ఘటనల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయే. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఇందులో రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లో ఉన్న వ్యక్తి నటించాడు కదా.. ఆయనలో ఎలాంటి మార్పు గమనించారు?
-19 ఏళ్ల వ్యక్తికున్న ఆలోచనలు 35 ఏళ్లప్పుడు ఉండవు. మనిషి ఆలోచనలు అతను తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా వయసుకు తగ్గట్టు మారుతూ ఉంటాయి. దీని వెనుక న్యూరో సైన్స్ ఉంటుంది. ఒకప్పుడు ఒఅక్తి కరెక్ట్ అని అనుకున్న వ్యక్తి ఒక 20 ఏళ్ల తర్వాత రాంగ్ అని అనిపించొచ్చు. చేసిన తప్పులపై పశ్చాత్తాపం ఉంటుంది.
మీ గత సినిమాలు ఆహ్లాదకరంగా ఉంటాయి కదా.. ఇలాంటి సినిమా తీయడం వెనక కారణం ?
-నేను ప్రతి కథని ఏదో ఐడెంటిఫై చేసుకుని చేసిందే. మల్లేశం కథ కూడా నేను అలా ఐడెంటిఫై చేసుకునే తీశాను. అయితే ఆ సినిమాని అంతమంది ఆడియన్స్ చూస్తారని నేను అనుకోలేదు. మనిషి ఫెయిల్ అయిన పరవాలేదు అనుకుని తీసిన సినిమా.
-కోవిడ్ తర్వాత అందరం కూడా మెంటల్ హెల్త్ కి గురయ్యాము.8 A.M. Metro కథ అలా వచ్చినదే. 23 సినిమా తీయడానికి కారణం నేను ఓ ఏజ్ లో కొన్ని తప్పులు చేశాను. ఇప్పటికీ కొన్ని గుచ్చుకుంటాయి. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అయితే హ్యాపీ.
ఈ సంఘటనలన్నీ చాలా డీప్ సబ్జెక్టు కదా.. దాన్ని సినిమాగా చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
-నిజానికి ఇది చాలా టఫ్ సబ్జెక్టు. ప్రొడక్షన్ పరంగా రైటింగ్ పరంగా అన్నిటి పరంగా ఇది చాలా టఫ్. ఇలాంటి సబ్జెక్టు తీయడం వెరీ చాలెంజింగ్. ఇన్ని లొకేషన్స్ ఇన్ని టైం ఫ్రేమ్స్ లో రాయడం దాన్ని తీయడం దాన్ని అర్థం చేసేలా చూపించడం కూడా చాలా కష్టం. ఏకగ్రతతో చూడాల్సిన సినిమా ఇది. ఆడియన్స్ కాస్త కాన్సెంట్రేట్ చేసి చూడాలి.
ఈ కథలో ఎలాంటి విషయాలు చర్చించారు?
-ఇందులో మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయి. అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీ 90%. ఇది స్టార్ట్ కాకముందు చుండూరు ఘటన తర్వాత జూబ్లీహిల్స్ ఘటన చూపించడం జరుగుతుంది. అయితే ఒకరికి తక్కువ శిక్ష ఎందుకు పడింది? ఒకరికి ఎక్కువ శిక్ష ఎందుకు పడింది అనేది చర్చించడం మరో థీమ్.
నటీనటులు గురించి?
-నిజానికి ఒక 10 ఏళ్ళు యాక్టింగ్ చేస్తే గాని ఇలాంటి రోల్స్ చేయలేరు. ఇలాంటి రూల్స్ వాళ్లకు దొరకడం లాటరీ టికెట్ అనుకోవాలి. మొదట నాకు కూడా నమ్మకం లేదు. అయితే ఫస్ట్ ఒక షెడ్యూల్ చేసి చూద్దామని భావించాను. సరిగ్గా వస్తే సినిమా చేస్తాను లేకపోతే ఆపేస్తానని ముందే చెప్పాను. అయితే నటీనటులంతా చాలా అద్భుతంగా చేశారు. అందరూ కూడా పాత్రలకు జీవం పోశారు.
ఈ సినిమాకి సెన్సార్ కష్టాలు ఎదుర్కొన్నారా ?
-ఒక్కటి కాదు చాలా కష్టాలు వచ్చాయి. చాలామంది ఈ సమయానికి ఈ కథ రెలవెంట్ కాదు కదా అంటారు. ఒక తప్పు జరిగితే ఒక వ్యక్తికి 24 గంటల్లో బెయిల్ వస్తుంది. అదే తప్పు చేసిన మరొకరికి రెండేళ్ళకి కూడా రాదు. ఈ సమస్య ఇప్పటికీ రెలెమెంట్ గా ఉంటుంది కదా.
-ఒక విషయాన్ని ఎంత సెన్సిటివ్ గా చెప్పాలో ఒక ఫిలిం మేకర్ గా నాకు క్లారిటీ ఉంటుంది.ఈ సినిమా వైలెన్స్ కి ఎగైనెస్ట్ చేసింది. సెన్సార్ విషయంలో కొన్ని ఇబ్బందులుఎదుర్కొన్నాం. కొన్ని సినిమాల్లో స్వేచ్ఛగా వదిలేసిన సీన్స్, పదాల్ని ఇంకొక సినిమాల్లో సెన్సార్ చేయమని చెప్తారు. ఒక చట్టం ఒకలా ఉన్నప్పుడు అన్ని సినిమాలు కి ఒకలాగా వర్తించాలి. కానీ అలా జరగటం లేదు. దీన్ని ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి. అలాంటి ఒక ప్రశ్నని రేకిత్తించే సినిమానే ఇది.