బ్రిటన్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ ఇండియాలో ఒలింపిక్ విజేతలకు జరుగుతున్న సంబరాలను అంత తేలిగ్గా వదిలేట్లు లేడు. ఏదయినా గెలిస్తేనే సంబరాలు చేసుకుంటారు కానీ, ఓడిపోతే సంబరాలు ఏంటో నాకర్థం కావడంలేదంటూ మళ్లీ ట్వీటాడు. అంతేకాదు.. లెక్కలతో సహా గణాంకాల జాబితాను జోడించి చూసుకోండి అంటూ ట్విట్టర్లో జోడించాడు.