టోక్యో ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి భారత్‌కు శుభారంభం అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చానుకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్‌మీడియా వేదికగా చానుపై ప్రశంసలు కురిపించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్ మీరాభాయి చానుకు హృదయపూర్వక అభినందనలు - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం - ప్రధాని మోదీ
వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల 49 కిలోల విభాగంలో చాను రజత పతకం సాధించింది. బరువులు ఎత్తడంలో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు ఒలింపిక్ పతకం అందించిన ఘనత చానుదే.
దాదాపు 24ఏళ్ల తర్వాత ఆమె ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఒలింపిక్స్ ఆరంభమైన రెండో రోజే భారత పతకాల కొరతను తీర్చేసింది. చిరస్థాయిగా నిలిచే ఘనత అందుకుంది