రియో ఒలింపిక్స్‌లో ఆడబిడ్డలు దేశానికి ఒలింపిక్ పతకాలు సాధించి పెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత్‌కు రెండు పతకాలు సాధించిపెట్టిన తెలుగు తేజం పీవీ సింధు, సాక్షి మాలిక్‌ల ప్రతిభను ప్రధాని నరేంద్ర మోడీ ఆకాశానికెత్తేశారు. ఆదివారం ఉదయం ఆలిండియా రేడియోలో నిర్వహించిన ‘మన్ కీ బాత్’లో క్రీడలను ప్రస్తావించిన మోడీ... సింధు, సాక్షిలతో పాటు దీపా కర్మాకర్, పుల్లెల గోపీచంద్‌లను ప్రధానంగా ప్రస్తావించారు.
ఆడబిడ్డలు దేశానికి ఒలింపిక్ పతకాలు సాధించిపెట్టారని వ్యాఖ్యానించిన మోడీ... సింధు, సాక్షిల సత్తాను ఆకాశానికెత్తేశారు. మరింత ప్రోత్సాహమిస్తే మరిన్ని అద్భుత విజయాలను వారు సాధిస్తారని చెప్పారు. ఇక ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయినా దీపా కర్మాకర్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. కోచ్‌గా మెరుగైన క్రీడాకారులను తయారు చేస్తున్న బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్... దేశానికి ఒలింపిక్ పతాకాలు రాబట్టడంలో సఫలమయ్యారని మోడీ వ్యాఖ్యానించారు.