క్రీడాకారుడిగా కాదు.. టీచర్‌గా గుర్తించుదాం.. గోపిచంద్‌పై మోడీ ప్రశంసల జల్లు

ఆదివారం, 28 ఆగస్టు 2016 (12:52 IST)
బ్మాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు వర్షం కురిపించారు. గోపిచంద్ బెస్ట్ కోచ్ అని, ఆయన దేశానికి అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేస్తున్నారంటూ కితాబిచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. గోపిచంద్‌ను ఓ క్రీడాకారుడిగా కంటే టీచర్‌గా గుర్తిస్తేనే మంచిదని తన అభిప్రాయంగా చెప్పారు. ఒలింపిక్స్‌లో ఇండియన్ డాటర్స్ మంచి విజయాలు అందించారిన పొగిడారు. మహిళలే అయినా.. ప్రోత్సహిస్తే రాణిస్తారని నిరూపించారని గుర్తు చేసారు. 
 
ఈ సందర్భంగా పీవీ సింధూ, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ తోపాటు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఇతర క్రీడాకారులకు మోదీ అభినందనలు తెలియజేశారు. గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందిన పీవీ సింధూ ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో వెండిపతకాన్ని తీసుకొచ్చి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని ప్రధాని గుర్తు చేశారు.  

వెబ్దునియా పై చదవండి