గవర్నర్‌‌ను కలిసిన పీవీ సింధు.. రూ.30 లక్షల నగదు బహుమానం

శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:57 IST)
హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు గవర్నర్‌ బిశ్వభూషన్‌ను కలవనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె విజయవాడకు వచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పీవీ సింధు కలిశారు. టోక్యో ఒలింపిక్స్‌లో గెలుచుకున్న కాంస్య పతకాన్ని సీఎంకు చూపించారు. సింధును ఆయన సత్కరించారు. మీ ఆశీర్వాదంతోనే పతకాన్ని నెగ్గానని జగన్‌కు సింధు తెలిపింది. 
 
దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం కొనియాడారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారుకావాలని జగన్ ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అధికారులు అందించారు.
 
అంతకుముందు పీవీ సింధు శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటాన్ని అర్చకులు ఆమెకు అందజేశారు. అలాగే, మరో వీఐపీ చాముండేశ్వరినాథ్ కూడా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు