క్రీడాకారులు కాస్త సక్సెస్ అయ్యారంటే చాలు... తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా చేయాలంటూ ప్రముఖ కంపెనీలు ఎగబడటం మనకు తెలిసిన విషయమే. ఇటీవలే ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ మహిళల విభాగంలే రజత పతకాన్ని తెచ్చిన పి.వి సింధు ఇప్పుడు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. ఇప్పటికే సానియా మీర్జా, సైనా నెహ్వాల్ తదితర మహిళా క్రీడకారులు ఆయా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.