హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

దేవీ

శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (18:38 IST)
Rupa, indraganti, bharani, sivalenka, priyadarshi
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో హీరో ప్రియదర్శి చేసిన చిత్రం ‘సారంగపాణి జాతకం’.  శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో రూపా కొడవయూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. 
 
ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ .. ‘ప్రియదర్శి వెర్సటైల్ హీరో అని నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు ఆడియెన్స్ కూడా చెబుతున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో ఇది నా మూడో సినిమా. హ్యాట్రిక్ హిట్ అయినందుకు ఆనందంగా ఉంది. సినిమా బాగుందని ఎంతో మంది ఫోన్‌లు, మెసెజ్‌లు చేస్తున్నారు. ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్.  20 ఏళ్లుగా నన్ను ఈ ప్రేక్షకులు ప్రేమిస్తూ, ఆదరిస్తూనే ఉన్నారు. మా సినిమాకు బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడు నిలిచిన నా టీంకు థాంక్స్. రూపా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, శ్రీనివాస్ అవసరాల చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకెళ్లిన తనికెళ్ల భరణి ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఇది సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం. ఇది థియేటర్లోనే చూడాల్సిన చిత్రం. మా సినిమా అద్భుతంగా ప్రారంభం అయింది. ఈ మూవీని మరింత పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
ప్రియదర్శి మాట్లాడుతూ .. ‘ఈ రోజు మా ‘సారంగపాణి జాతకం’ టీం గెలిచింది. అంటే నేను కూడా గెలిచాను. గురువారం నాడు వైజాగ్‌లో ప్రీమియర్లు వేసినప్పుడు ఫుల్ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. బుక్ మై షోలో మా చిత్రం ట్రెండ్ అవుతోంది. రివ్యూలు కూడా అద్భుతంగా వచ్చాయి. మా సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. సినిమా గెలిచింది.. మేం గెలిచాం’ అని అన్నారు.
 
శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘సారంగపాణి జాతకం’ ఎప్పుడూ వాయిదా పడుతోందని అంతా అన్నారు. కానీ సరైన టైంకి వచ్చిందని ఇప్పుడు అంటున్నారు. మా చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. దీని ప్రభంజనం ఇప్పుడే ప్రారంభం అయింది. మౌత్ టాక్‌తో ఈ చిత్రం మరింత ముందుకు వెళ్తుందని అంతా అంటున్నారు. మా సినిమాకు మీడియా ఎనలేని ప్రోత్సాహాన్ని అందించింది. ఈ చిత్రాన్ని ఇంత ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. ప్రస్తుతం నేను ఎంతో సంతోషంగా ఉన్నాను’ అని అన్నారు.
 
తనికెళ్ల భరణి మాట్లాడుతూ .. ‘చాలా రోజుల తరువాత హాల్ అంతా నవ్వడం చూశాను. థియేటర్లో ఆడియెన్స్ పగలబడి నవ్వుతున్నారు. నవ్వులతో థియేటర్ దద్దరిల్లిపోయింది. నేను టీంతో కలిసి సినిమా చూశాను. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి గారికి, నిర్మాత కృష్ణ ప్రసాద్ గారికి థాంక్స్. ఈ మూవీ మున్ముందు మరింత పెద్ద సక్సెస్ కానుంది’ అని అన్నారు.
 
ఈ సక్సెస్ ప్రెస్ మీట్‌లో హీరోయిన్ రూపా కొడవయూర్, అవసరాల శ్రీనివాస్, వడ్లమాని శ్రీనివాస్, కెమెరామెన్ పీజీ విందా, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తదితరలు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు