చెన్నైలో రోడ్డు ప్రమాదం.. భారతీయ రేసర్ అశ్విన్, అతని భార్య సజీవ దహనం

శనివారం, 18 మార్చి 2017 (10:46 IST)
చెన్నైలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియన్ రేసల్ అశ్విన్ సుందర్, అతని భార్య సజీవ దహనమయ్యారు. తన భార్య నివేదితతో కలసి కలసి అతను ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదానికి గురైంది. 
 
చెన్నై నగరంలోని శాంథోమ్ హైరోడ్డులో రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారులో ఇరుక్కుపోయిన అశ్విన్, అతని భార్య ఈ ఘటనలో సజీవ దహనం అయ్యారు. అశ్విన్ మరణవార్తతో అందరూ షాక్ కు గురయ్యారు.
 
భారతీయ ఎఫ్4 రేసర్ అశ్విన్ సుందర్ గత 1985 జూలై 27 న చెన్నైలో జన్మించారు. 2003లో ఎంఆర్ఎఫ్ ఫార్ములా మోండియల్ నేషనల్ ఛాంపియన్ షిప్‌ను తొలిసారి గెలుచుకున్నారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎఫ్4 నేషనల్ ఛాంపియన్‌గా అవతరించారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సైతం అశ్విన్ ప్రతిభను కనబరిచారు. 

వెబ్దునియా పై చదవండి