Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

దేవీ

శనివారం, 5 జులై 2025 (17:15 IST)
Mitra Sharma, Geethanand, Srihan and others
రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్ పై దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. 
 
బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈరోజు మీడియా సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అంగరంగ వైభవంగా వర్జిన్ బాయ్స్ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తామని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర బృందం తెలిపింది. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో కొన్ని థియేటర్లలో డబ్బు మీపై వర్షంలో కురిసి ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అంటూ తెలిపారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు దయానంద మాట్లాడుతూ, మేము కాలేజీ రోజుల్లో ఉండగా చేసిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరికీ కనెక్ట్ అవుతాయి. చిత్రానికి చాలా మంచి బృందం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. స్మరణ్ సాయి సంగీతం ఈ చిత్రానికి బోనస్ గా నిలుస్తుంది. మా అన్నయ్య గీతానంద్ తో నాకు ఇది రెండవ చిత్రం. అలాగే గీతానంద్, మిత్ర శర్మ మధ్య సీన్లు అద్భుతంగా వచ్చింది అన్నారు.
 
నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ, ఈ చిత్రానికి వర్తిన్ బాయ్స్ అనే టైటిల్ ఖచ్చితంగా సూట్ అయ్యే టైటిల్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఒక పాట ఎంతో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో పెద్దవారు ఎవరూ లేరు. అయినా ఈ సినిమాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్. ఎన్నో సర్ప్రైజ్ లతో ఈ సినిమాతో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము" అన్నారు.
ఇంకా నటులు గీతానంద్, నటి మిత్ర శర్మ, శ్రీహాన్ తదితరులు మాట్లాడుతూ, సినిమాపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు