పాకిస్తాన్‌లో పరిమిత కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, ప్రాంతీయ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం కోసం మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ ఆఫీసుకు తాళం వేసింది. ఈ చర్యను పాకిస్తాన్ క్షీణిస్తున్న వ్యాపార వాతావరణానికి ఆందోళనకరమైన సూచికగా అభివర్ణించారు.
దీని ఫలితంగా మైక్రోసాఫ్ట్ అనేక దేశాలలో కార్యకలాపాలు, శ్రామిక శక్తిని తగ్గించింది. అయితే, పాకిస్తాన్ నుండి వైదొలగడం, స్థానిక టెక్, వ్యాపార వర్గాలలో ఆందోళనలను రేకెత్తించింది. జూన్ 2025 నాటికి, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కేవలం 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
2024 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వాణిజ్య లోటు 24.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మైక్రోసాఫ్ట్ యొక్క పాకిస్తాన్ కార్యాలయ మూసివేత గ్లోబల్ వర్క్‌ఫోర్స్ తగ్గింపులో భాగంగా జరిగిందని అనుకోవచ్చు. ఇటీవల మైక్రోసాఫ్ట్ మొత్తం 2,28,000 మంది ఉద్యోగులలో 4 శాతం మందిని తొలగించింది.