గత 2019లో నాదల్, మరియాలు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రఫెల్ వయసు 36 యేళ్లు. టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో అత్యధికంగా 22 గ్రాండ్ స్లామ్స్ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఏటీపీ పురుషుల ర్యాంకింగ్‌లో నాదల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో స్పెయిన్‌కే చెందిన యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ గార్సియా కొనసాగుతున్నాడు.
తండ్రి అయిన రఫెల్ నాదల్‌కు సెర్బియా టెన్నిస్ వీరుడు నొవాక్ జకోవిచ్ శుభాకాంక్షలు తెలిపాడు. "కంగ్రాట్స్.. నాకు ఇప్పటివరకు తెలియదు. అది అద్భుతమైన వార్త. నాదల్, అతని భార్య, బిడ్డ ఆరోగ్యం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఒక తండ్రిగా నేను అతనికి ఎంటువంటి సలహా ఇవ్వను. ఆయనకు పెద్ద కుటుంబం ఉంది. నాదల్ తనను తాను అనుభూతి చెందుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని నవ్వుతూ ట్వీట్ చేశారు.