రియో ఒలింపిక్స్ క్రీడల్లో మన బంగారం అభినవ్ బింద్రా ఫైనల్ కు చేరుకున్నాడనగానే స్వర్ణపతకం వస్తుందనకున్నారు. కానీ ఆ ఆశ నిరాశగా మిగిలింది. బింద్రా 4వ స్థానంతో సరిపెట్టుకోవడంతో ఈసారి ఎలాంటి పతకమూ ఈ విభాగంలో లేకుండా పోయినట్లయింది. అంతకుముందు 10 మీ.ఎయిర్ రైఫిల్ పురుషుల అర్హత పోటీల్లో అభినవ్ బింద్రా 7వ స్థానంలో నిలిచాడు. వరుసగా ఆరు సిరీస్‌లలో 104.3, 104.4, 105.9, 103.8,102.1,105.2తో కలిపి మొత్తం 625.7 స్కోరుతో ఫైనల్‌కు చేరుకున్నాడు. చివరికి ఫైనల్లో నిలబడలేకపోయాడు.