మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో బోపన్న జంట విఫలమైంది. తద్వారా రన్నరప్‌గా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ 4-6, 6-7 (5/7)తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జోడీ చేతిలో పరారైంది.
దాదాపు 71 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించింది. ఓ డబుల్ ఫాల్ట్ చేసింది. దీంతో రోజర్.. టెకావ్ జోడీ ఖంగుతింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీకి 1,38,400 యూరోల (రూ. కోటీ 5 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఆద్యంతం మెరుగ్గా రాణించినప్పటికీ.. టెకావ్ జంటకు గట్టిపోటినివ్వలేకపోయింది. దీంతో ఈ పోటీలో బోపన్న జోడీ రన్నరప్‌గానే మిగిలిపోయింది.