బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, కశ్యప్ ఈ రోజు... డిసెంబరు 14న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు విశ్వనీయ సమాచారం. ఆ తర్వాత 16న గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఇన్విటేషన్ కార్డులను ప్రముఖులకు వెళ్లాయి. కాగా సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇన్నాళ్లూ టోర్నీలు గెలవడంపైనే దృష్టి పెట్టామని.. పెళ్లి తర్వాత తనపై బాధ్యత పెరుగుతుందని సైనా తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ పూర్తయ్యే వరకు పెళ్లి ప్రస్తావన వద్దనుకున్నాం. కానీ ఖాళీ దొరకడంతో పెళ్లికి సిద్ధమయ్యామని చెప్పింది. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా రాలేదని, వాళ్లే అర్థం చేసుకున్నారని సైనా పేర్కొంది.