భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తనయుడు అసద్‌తో ఆమె వివాహం జరుగనుంది. గత కొంతకాలంగా వీరి వివాహంపై వస్తున్న వార్తలను నిజంచేస్తూ ఆనం, అసద్ వివాహాన్ని ధ్రువీకరించారు. వీరిద్దరి వివాహం ఈ ఏడాది డిసెంబర్‌లో జరుగనుంది.