డబ్ల్యూటీఏ ఫైనల్స్‌‌లో ఓడినా.. ర్యాంకులో సానియా-టీనా జోడీ టాపే..

సోమవారం, 31 అక్టోబరు 2016 (17:55 IST)
డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో పరాజయం పాలైనప్పటికీ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టాప్‌లో నిలిచింది. సింగపూర్ డబ్ల్యూటీఏ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన సానియా మిర్జా-మార్టినా హింగిస్ జోడి శనివారం జరిగిన సెమీస్‌లో పరాజయం పాలైంది.

దీంతో మహిళల డబుల్స్ విభాగంలో వరుసగా రెండో ఏడాది కూడా నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన క్రీడాకారిణిగా సానియా మిర్జా గుర్తింపు పొందారు. మ్యాచ్ అనంతరం ర్యాంకుపై సానియా స్పందించింది. వరుసగా రెండో ఏడాది కూడా నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోవడం పట్ల సానియా మీర్జా హర్షం వ్యక్తం చేసింది. 
 
ఇంతక ముందు వరుసగా తాను 80 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన సంగతి తెలిసిందే. తద్వారా మహిళల డబుల్స్ విభాగంలో ఎక్కువ రోజులు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన భారత క్రీడాకారిణిగా సానియా మిర్జా నిలిచింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్‌లో... సానియా మీర్జా జోడిని ఓడించిన ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా) జోడీ విజేతగా నిలిచింది. 

వెబ్దునియా పై చదవండి